హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
భద్రకాళి ఓరుగల్లు ప్రాంతంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ర్యాలీకి Dr. చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారీ సంఖ్యలో యువత, హిందూ బంధువులు పాల్గొని భక్తి, ఐక్యతను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా డా. చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ…హిందూ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
హిందూ కార్యకర్తలపై నమోదయ్యే కేసులకు భయపడవద్దని, తమ సంస్థ తరఫున పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో నిజమైన మార్పు కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, హిందూ సేవా సమితి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
#sidhumaroju
Alwal









