వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలి: ఐజేయూ ప్లీనరీలో శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీలో ఆ సంఘం అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేయడం వల్ల జర్నలిస్టుల పరిస్థితి అసంఘటిత కార్మికుల కంటే దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు దశాబ్దాలుగా వేతన సవరణలు లేవని, వెంటనే నూతన వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మరిన్ని అధికారాలతో ‘మీడియా కౌన్సిల్’గా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎల్. కృష్ణదేవరాయలు తదితరులు పాల్గొని జర్నలిజం విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.










