భవానీపురంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్కు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. శనివారం భవానీపురం పోలీస్ కాలనీలో రూ. 6.2 కోట్ల హడ్కో నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 42 నుండి 45 డివిజన్ల పరిధిలో ఉన్న ఓవర్ లోడ్ మరియు విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించేందుకు ఈ సబ్ స్టేషన్ ఎంతో దోహదపడుతుందన్నారు. రాబోయే వేసవి దృష్ట్యా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆదా చేసిన ప్రతి యూనిట్ ఉత్పత్తితో సమానమని ఆయన హితవు పలికారు.










