పుంగనూరు నియోజకవర్గం లో టిడిపి ఆవిర్భావ వేడుకలు

0
3

పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, ‘జై తెలుగుదేశం, చంద్రబాబు వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు# కొత్తూరు మురళి.