పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని చిన్న కొండా మరి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు నాగరాజా (45) తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఓ ప్రైవేటు బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ నాగరాజాని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.










