శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్‌లో HPV వ్యాక్సిన్ ప్రారంభం.!

0
14

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, అరుణ, వెంకటమ్మ, లింగారెడ్డి, సాజిద్, మహేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…బాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ టీకా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ముఖ్యంగా గర్భాశయ కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడంలో హెచ్పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమం భాగంగా ట్రివేణి స్కూల్‌కు చెందిన 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ అందజేశారు. బాలికల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ ఆరోగ్య సేవలను మరింతగా వినియోగించుకోవాలని కోరారు.

#Sidhumaroju

Alwal