కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన ‘పసుపు’ పండగ

0
1

కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్
మద్దూరులో మిన్నంటిన ‘పసుపు’ పండగ
ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు

నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా టీడీపీ జెండా ఎగురవేసినారు.ఈ వేడుకను టీడీపీ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు
.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బుడ్డోల్ల శ్రీనివాస్ ,కార్యకర్తలు కలిసి జెండాను ఆవిష్కరించిన తర్వాత బుడ్డోల్ల శ్రీనివాస్ పార్టీ సిద్ధాంతాలను చాటిచెప్పారు టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని కేవలం పేద ప్రజలకోసం ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించాడు అని నేడు తెలంగాణలో కూడ పేద ప్రజలకు న్యాయం జరుగలి అంటే మళ్ళీ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకుని రావాలి టీడీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండే

​ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ బుడ్డోల్ల మల్లేశ్వరి, మద్దూర్ మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బుడ్డొల్ల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు జోగు హనుమంతు, మాజీ వార్డ్ మెంబర్ వంచర్ల కిష్టప్ప పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు వెంకటయ్య, బీములు, నర్సప్ప, హనుమంతు, నర్సింలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా “జై తెలంగాణ – జై తెలుగుదేశం – జై ఎన్టీఆర్” అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు మద్దూరు పురవీధుల్లో మారుమోగాయి.
భారత్కో అవాజ్  కొడంగల్ ​మద్దూరు
#సూర్యమోహన్