హైదరాబాద్ : బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. డీసీపీ టాస్క్ ఫోర్స్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ స్థాయిలో అక్రమ గ్యాస్ వ్యాపారం వెలుగులోకి వచ్చింది.
పంజగుట్ట స్మశాన వాటిక ప్రాంతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 10 మంది పై కేసులు నమోదు చేశారు.
టాస్క్ ఫోర్స్ అధికారులు ముఠా నుంచి 420 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ దందాలో ఉపయోగించిన రెండు ఆటోలు, రెండు బొలెరో వాహనాలు, ఒక ఓమినీ, రెండు డీసీఎం వాహనాలను కూడా జప్తు చేశారు.
దర్యాప్తులో భాగంగా మెట్రో హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం కూడా ఈ బ్లాక్ దందాలో పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువగా సుమారు 2100 రూపాయల విలువ గల సిలిండర్లను 6 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు వెల్లడైంది.
ఇదిలా ఉండగా “గ్యాస్ సప్లై” పేరుతో ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రజలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. కావాలనే తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
#sidhumaroju
Alwal










