ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.

0
1

ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వరుసగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.గ్రామానికి చెందిన ఖాదర్ వలీ (72), అల్లావుద్దీన్ (69), మైద్దీన్ (62)లు కేవలం 16 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.

మార్చి 18న అనారోగ్యంతో అల్లావుద్దీన్ మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక మరుసటి రోజు మార్చి 19న మైద్దీన్ గుండెపోటుతో కన్నుమూశారు. అనంతరం ఇద్దరు తమ్ముళ్ల మృతితో తీవ్రంగా కలత చెందిన పెద్ద అన్న ఖాదర్ వలీ ఆదివారం (మార్చి 29) మృతి చెందడంతో ఈ విషాదం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.ఒకే కుటుంబంలో వరుసగా ముగ్గురు సోదరులు మరణించడం గ్రామంలో తీవ్ర శోకాన్ని నింపింది. గ్రామస్తులు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.