బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల అరెస్టైన డా.బాలాజీకి క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది.
దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 16కు చేరగా, ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. పరారీలో ఉన్న క్లింటన్ కోసం ప్రత్యేక బృందాలు గోవాలో గాలింపు చర్యలు చేపట్టాయి.










