(Dacoit: A Love Story/Ek Prem Katha ఉత్కంఠభరితమైన ఈ పాన్-ఇండియా హిందీ-తెలుగు యాక్షన్-థ్రిల్లర్ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది .
అడవిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి చిచ్చుబుడ్డి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను రామ్ మిర్యాల, జోనితా గాంధి ఆలపించారు. అంతేకాదు జోనితా గాంధీ ఈ సాంగ్‌లో నర్తించింది కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది.










