ఆ తగ్గింపు కంపెనీలకి వినియోగదారులకు కాదు చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

0
1

చమురు కంపెనీల కోసం కేంద్రం కీలక నిర్ణయం – పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 122 డాలర్లకు చేరడంతో తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలను (IOCL, BPCL, HPCL) ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లీటరుకు ₹10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అయితే, ఈ నిర్ణయం వల్ల రిటైల్ ధరలు తగ్గవని, ప్రస్తుత ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచడానికే ఈ తగ్గింపు ఉపయోగపడుతుందని పెట్రోలియం

శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ప్రస్తుతం చమురు కంపెనీలు పెట్రోల్‌పై సుమారు ₹26, డీజిల్‌పై ₹81.90 చొప్పున నష్టపోతున్నాయని, ఈ ఎక్సైజ్ కోత ఆ నష్టాన్ని కొంతమేర తగ్గిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దేశీయ అవసరాల కోసం డీజిల్ ఎగుమతులపై కూడా అదనపు సుంకాలు విధించి, సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది.