టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి కోటలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. టీడీపీ జెండాను మాజీ ఎంపీపీ బి.సింహాచలంతో కలిసి ఆవిష్కరణ చేశారు.
అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలను అధిష్ఠానం గుర్తిస్తుందన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని స్క్రీన్ ద్వారా వీక్షించారు.
#RAJESH










