హైదరాబాద్: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎం సునీల్ ని కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న నీటి సరఫరా మరియు కాల్వల పనులపై సమీక్ష నిర్వహించారు.
భీమ్‌రావ్ నగర్, ఎంఈఎస్ కాలనీ, ఇంద్రానగర్, లక్ష్మీనగర్, టెంపుల్ అల్వాల్, బండబస్తీ, ప్రశాంత్ నగర్, జానకి నగర్, న్యూ ఎంఈఎస్ కాలనీ తదితర ప్రాంతాల్లో మంజూరైన పనుల పురోగతిపై ఆమె చర్చించారు.
ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న పనులు మరియు కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా సమయానికి పనులు పూర్తి కావడం అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు.
అలాగే పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు.
#sidhumaroju
Alwal










