టీడీపీ కార్యకర్త జయచంద్రకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతి.

0
1

మదనపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త కందికట్ల జయచంద్రకు పార్టీ పట్ల అంకితభావం, కష్టపడే తత్వం నాయకత్వాన్ని ఆకట్టుకుంది. ఆదివారం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా ఆయనకు బహుమతి అందజేశారు.

నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, (MYTDP) యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో, సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించడంలో జయచంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.