మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో నిర్వహిస్తున్న “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రక్షిషణ మహాభియాన్ – 2026” శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ఈ శిక్షణ శిబిరం తొలి రోజు కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్ గీత మూర్తి, స్టేట్ సోషల్ మీడియా కో-కన్వీనర్ వేముల వేణుగోపాల్, సీనియర్ నాయకుడు అకెళ్ల శర్మ, ప్రక్షిషణ శిబిరం క్లస్టర్ ఇన్‌చార్జ్ మల్లికా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ తరఫున విశిష్ట అతిథిగా బద్దం మహిపాల్ రెడ్డి హాజరై శిక్షణార్థులకు సూచనలు అందించారు.
ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య భరద్వాజ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










