మార్గదర్శులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు: పి4 విజయగాథలపై చర్చ.

0
1

పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో సోమవారం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

సంక్షేమ పథకాలకు భిన్నంగా, మానవతా దృక్పథంతో పేద కుటుంబాలను ఆదుకునే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సాధించిన ప్రగతిని ఈ వేడుకల్లో వివరించారు.