చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి నడివీధిలో ఏప్రిల్ 7, 8 తేదీలలో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని.
అనవసరంగా వాహనాలు నిలిపివేయవద్దని, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను దగ్గరగా చూసుకోవాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు #కొత్తూరు మురళి.










