మహావీర జయంతి: ఈటల రాజేందర్ అహింసా సందేశం”.|

0
5

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో జరగిన మహావీర జయంతి వేడుకలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు.

2625వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహాపురుషుల పాత్ర, అహింసా సిద్ధాంతం ప్రాముఖ్యతపై ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

అతని వ్యాఖ్యల ప్రకారం, “సర్వేజనా సుఖినోభవంతు” అనే భారతీయ నినాదం ప్రపంచానికి పాఠం నేర్పే విధంగా ఉంది. మహావీరుడు చెప్పిన అహింసా సిద్ధాంతమే మహాత్మా గాంధీని భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మూలం. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా అదే మార్గంలో దేశాన్ని నడిపిస్తున్నారు, ప్రపంచానికి ఇదే ఉదాహరణ.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ జి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు నర్మదా మల్లికార్జున్, సంపత్, పరాగ, విజయ్, పవన్, అలాగే జైన్ సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ వేడుక సందర్భంగా.. ఎంపీ. ఈటల రాజేందర్ ప్రతి ఒక్కరికి జయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

 

#sidhumaroju

Alwal.