రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|

0
1

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి

అవగాహన సదస్సులో వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి.

వైరా,రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి అన్నారు.

‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మండలంలోని సర్పంచులు, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లతో ”అరైవ్ అలైవ్” (Arrive Alive) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 18 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 370గా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 3,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

#sidhumaroju

Alwal