పి4తో బంగారు కుటుంబాల దిశగా అడుగులు – మదనపల్లిలో కార్యక్రమం.

0
0

మదనపల్లిలో సోమవారం నిర్వహించిన పి4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్‌షిప్) కార్యక్రమంలో మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రి తెలిపారు.

జిల్లాలో సుమారు 70 వేల “బంగారు కుటుంబాలు” గుర్తించగా, 31 వేల కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని చెప్పారు. కలెక్టర్ ప్రతి కుటుంబానికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పరస్పర సహకారంతో సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు