పుంగనూరు నియోజకవర్గం: పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

0
4

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో సోమవారం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల మస్తాన్ అనే బాలుడు తన ఇంటి వద్ద కూర్చుని ఉండగా పిచ్చికుక్క దాడి చేసింది.

ఈ దాడిలో బాలుడి శరీరమంతా గాయాలయ్యాయి. వైద్యుల అంచనా ప్రకారం, బాలుడు కనీసం 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. గ్రామస్తులు వీధి కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.