రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్న శుభారాణి (34) పీలేరు నుంచి స్కూటీపై వస్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.
మహిళను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ చెప్పారు# కొత్తూరు మురళి.










