అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ కీలకమని, మొత్తం రూ. 3,32,205 కోట్ల బడ్జెట్లో అన్నమయ్య జిల్లాకు
రూ. 6,010.53 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ‘సూపర్ సిక్స్’ పథకాల ద్వారా పేదలు, రైతులు, మహిళలు, కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.










