మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.

0
1

మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతోందని తెలిపారు.

కడ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో వచ్చిన బృందం జిల్లాలో జల సంరక్షణ పనులను పరిశీలించి ప్రశంసించింది. భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని, శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు అమలు చేస్తున్నామని, జలధార ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయదగిన నమూనాగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.