అట్టహాసంగా గాయత్రి డిగ్రీ అండ్ పీ.జీ కళాశాల ఫేర్ వెల్ డే సంబరాలు

0
3

తెలంగాణ పెద్దపల్లి జిల్లా.తేదీ 31/03/2026 స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో గాయత్రి డిగ్రీ అండ్ పి జి కళాశాల వీడ్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ గారు ఈ కార్యకమానికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సోషల్ మీడియాకు ప్రభావితం కావద్దని తెలియజేశారు.

విద్యార్థులు తమలోని నైపుణ్యాలను గుర్తించి రాణించాలని తెలియజేశారు. గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మరియు కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉత్తేజపరిచాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే రవీందర్ అధ్యాపక బృందం విద్యార్థినిలు విద్యార్థులు పాల్గొన్నారు.