తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ
ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి.









