మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.

0
1

మంగళవారం మదనపల్లెలో ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని సిటిఎం రోడ్డు దేవతా నగర్ కు చెందిన హేమంత్ (25), మహేష్ (32) ఆర్టీసి డిపోలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.

మంగళవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బైకులో ఆర్టీసి బస్టాండుకు వెళుతుండగా, మార్గమధ్యంలో సిటిస్టం రోడ్డు ఎస్టేటు వద్ద కుక్కలు అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి పడిపోయింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.