విజయవాడలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల లింకులు ఉన్నాయని అనుమానాలు

0
2

అమరావతి- 31-03-2026 మంగళవారం – విజయవాడ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద లింకులు ఉన్నాయని ఆరోపణలపై ముస్లిం యువకులను అరెస్టు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ దుర్గారావు గారిని మైనారిటీ నాయకులు కలిసి, ఈ ఉగ్ర లింకులో ఉన్న యువకులు ఎటువంటి వారు ఎందుకు ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారు, వారు తెలిసి చేసి ఉంటారా? లేక తెలియక ఏవైనా తప్పులు చేసి ఉండవచ్చా?

లేదా నిజంగానే వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? అనే విషయాలపై చర్చించడం జరిగింది. అదే విధంగా ఇటువంటి వారి వల్ల మొత్తం ముస్లిం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా యువతకు ఏ విధంగా అవగాహన కలిగించాలి అనే అంశాలపై చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన ఎసిపి గారు భవిష్యత్తులో ఎటువంటివి పునరావృతం కాకుండా మైనార్టీ నాయకులతో కలిసి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అబ్దుల్ మతిన్ గారు, ముస్లిం సంక్షేమ సమితి అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ముక్తార్ అలీ, మైనార్టీ నాయకులు వాజిద్ ఖాన్, జమీయతే అహలే హదీస్ నగర అధ్యక్షులు నసీర్ ఉమ్రి గారు, షాహి మస్జిద్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ వహాబ్ గారు, మహమ్మద్ రిజ్వాన్ ఉల్లాహ్ ఖురేషి గారు తదితరులు పాల్గొన్నారు. త్వరలో విజయవాడ నగర గల కమీషనర్ ఆఫ్ పోలీస్ వారిని కలిసి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేశారు.