శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కొండా ప్రసాద్ స్వామి మంగళవారం ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పరిపాలనాపరంగా ఆయన ఈ నెల 9, 10 తేదీల్లో విధుల్లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ ఏడీఏగా పనిచేస్తున్న రమణ భారతి ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా నియమితులయ్యారు










