చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం

0
3

మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది. తల్లి తోక అనిత (50) హౌస్కిపింగ్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మార్చి 30న ఉదయం 8 గంటలకు అనిత డ్యూటీకి వెళ్లినప్పుడు, కుమార్తె బార్గవి ఇంట్లోనే ఉంది. సాయంత్రం తిరిగి వచ్చిన తల్లికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.