నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు

0
3

నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు

దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే లక్ష్యంతో పాన్ కార్డుకు సంబంధించిన పలు కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాన్ పొందడానికి ఇకపై ఆధార్ కార్డుతో పాటు గుర్తింపు, పుట్టిన తేదీని నిర్ధారించే అదనపు పత్రాలు తప్పనిసరి.

పాన్ కార్డులోని పేరు ఆధార్‌తో సరిపోలాలి. ఆర్థిక లావాదేవీల్లో రూ.10 లక్షలు దాటితే పాన్ వివరాలు అవసరం, వాహనం కొనుగోలు రూ.5 లక్షలు మించితే పాన్ తప్పనిసరి. భీమా పాలసీలకు ప్రతి పాలసీకి పాన్ తప్పనిసరి. ఆస్తి లావాదేవీల పరిమితి రూ.20 లక్షలకు, హోటళ్లు/రెస్టారెంట్లలో నగదు చెల్లింపుల పరిమితి రూ.1 లక్షకు పెరిగింది.