అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. పెద్దమండెం మండలం కలిచెర్ల వద్ద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ను సందర్శించి, పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను ఆరా తీశారు.
గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేసి పీలేరు, రాయచోటి ప్రాంతాలకు పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టు అమలవుతోందని, పైప్లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా పనులను వేగవంతం చేసి, నాణ్యతలో రాజీ పడకూడదని కలెక్టర్ ఆదేశించారు.










