మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లేబర్ కార్డుల పంపిణీ.|

0
8

మల్కాజ్‌గిరి: అల్వాల్‌లో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కీలక కార్యక్రమం ఘనంగా జరిగింది. అల్వాల్ ప్రాంతంలోని మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో నిర్వహించిన లేబర్ కార్డు పంపిణీ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముందుగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికులకు ఎమ్మెల్యే స్వయంగా లేబర్ కార్డులను పంపిణీ చేశారు. కార్మికులలో ఉత్సాహాన్ని నింపిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కార్మికుల సంక్షేమం ప్రభుత్వాల ప్రాధాన్య కర్తవ్యం అని పేర్కొన్నారు. లేబర్ కార్డు ద్వారా కార్మికులు పలు సంక్షేమ పథకాలు, భద్రతా ప్రయోజనాలు పొందగలరని తెలిపారు. ప్రతి అర్హత గల కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్మికులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal