తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో పూర్తి మెజారిటీతో ఆమోదం పొందిందని టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేందర్ నాయుడు గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం సాయంత్రం టిడిపి నాయకులు కార్యకర్తలు సాధారణ
ప్రజలతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా టపాసులు పేరుస్తూ దీపాలు వెలిగించి మిఠాయిలు పంచి పండుగ వాతావరణం లో ప్రజలతో కలిసి ఆనందం పంచుకున్నారు అమరావతి కోసం నిరంతరం పోరాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గొంతుకుగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువత ఆశయాలకు ప్రత్యేకగా నిలిచిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని తెలిపారు అమరావతి
రాజధాని నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవుతుందని పరిశ్రమలో పెట్టుబడులు రాష్ట్రానికి అకర్షితమవుతాయని తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి చట్టబద్ధతకు హర్షం వ్యక్తం చేశారు










