మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ ఆదర్శ్ నగర్‌లోని మైసమ్మ ఆలయంలో భక్తి వాతావరణం నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు ఆలయంలో నిర్వహించిన ఆర్చనలు, హోమాల్లో పాల్గొని ప్రాంత ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి ఆశీర్వాదాలు పొందారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రముఖులు అయిన శ్రీధర్ గౌడ్, యాదగిరిగౌడ్, అర్వింద్, మహేందర్, సాజిద్, పిల్లై, పోచయ్య, సెంథిల్, అరుణ్, సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగుతూ, స్థానిక ప్రజల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ప్రజలతో కలిసి నాయకులు పాల్గొనడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాంతంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
#sidhumaroju
Alwal










