కాట్రియాలలో ఉత్సాహంగా గ్రామసభ

0
3

రామాయంపేటలోని కాట్రియాలలో ’99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభ గురువారం సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా అధ్యక్షతన ఉత్సాహంగా జరిగింది. తొలుత ముఖ్యమంత్రి సందేశాన్ని కార్యదర్శి ధనలక్ష్మి చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఆరు గ్యారంటీ పథకాల అమలు తీరుపై అధికారులు సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.