సికిందరాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. తాడు బందు వీరాంజనేయస్వామి దేవాలయంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలకు పలు చోట్ల ఎమ్మెల్యే హాజరై దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి, అన్నదానాలను, హనుమాన్ ర్యాలీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










