అన్నమయ్య జిల్లా పోలీసులు నకిలీ విలేఖరులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను బుధవారం ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ స్టిక్కర్లను ఆవిష్కరించారు.
ఈ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తే సంబంధిత విలేఖరి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, నకిలీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మొదటి విడతగా అక్రిడిటేషన్ ఉన్న వారికి స్టిక్కర్లు పంపిణీ చేశారు.









