మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని యాదవ్ నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, గౌడ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి పాల్గొని, పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన మహాయోధుడు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని స్పష్టం చేశారు.
అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మురుగేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










