పుంగనూరు నియోజకవర్గం : సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలు

0
1

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల కేంద్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాలపై ప్రసరించాయి.

ఈ అరుదైన సంఘటనను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుబ్రహ్మణ్య, సూర్యాష్టకాలను పఠించారు# కొత్తూరు మురళి.