హైదరాబాద్ : మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్లో విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రామంతపూర్–మేడ్చల్ ప్రాంతంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సుమారు 1500 మంది గ్రామీణ విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన ప్రస్తావించారు. ఈ విద్యార్థులకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు.
నేరెడిమేట్ డివిజన్ పరిధిలోని గవర్నమెంట్ స్థలాన్ని సర్వే చేసి, సర్వే నెంబర్ 222లో ఉన్న డంప్ యార్డ్‌ను తొలగించి అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
విద్యార్థులు మరియు కాలనీ వాసుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల కోసం సింథటిక్ కోర్టులు నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.
#sidhumaroju
Alwal










