విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష… మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు.

0
1

ఏపీ విద్యాశాఖలో డిజిటల్ విప్లవం: మంత్రి లోకేశ్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ ఆధారిత విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ పడొద్దని, లీప్ యాప్ (LEAP App) ద్వారా తల్లిదండ్రుల నుండి నిరంతరం ఫీడ్‌బ్యాక్ సేకరించాలని స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నవంబర్ నాటికి 95 ఆటిజం సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మక స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ, 2028 నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు.