4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.

0
3

తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జండాలు,బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు CITU జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు,AITUC జిల్లా కార్యదర్శి కడారి సునీల్,బి అశోక్ లు మాట్లాడుతూ .

.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చిందని,ఈ దుర్మార్గమైన లేబర్ కోడ్స్ ను వెంటనే ఉపసమరించుకోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్ ను అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు N బిక్షపతి సహాయ కార్యదర్శులు సీపెల్లి రవీందర్, జి జ్యోతి,తాండ్ర అంజాయ,AITUC నాయకులు పూసల రమేష్,పేర్క రాయమల్లు,INTUC జిల్లా ఉపాధ్యక్షులు మేకల సతీష్ IFTU నాయకులు CITU జిల్లా కమిటీ సభ్యులు శివరామకృష్ణ,యాకుబ్,నాయకులు సాగర్ ,నరేష్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.