అమరావతికి చట్టబద్ధత.. ఐదు కోట్ల ఆంధ్రుల విజయం అన్న మంత్రి మండిపల్లి.

0
0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజలతో కలిసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మంత్రిగారు సంబరాలు జరుపుకున్నారు పటాకులు పేయించి స్వీట్లు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన మలుపు అని మంత్రిగారు పేర్కొన్నారు అమరావతి

అభివృద్ధి ద్వారా ఆర్థిక పురోగతి ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రానికి కొత్త దిశ లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన ఆడు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు