చీరాల – పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మయ్య, సుబ్బయ్య, ఉదయం పొలానికి వెళ్లి తిరుగు వస్తుండగా వెనుకవైపుగా ఆటో ఢీకొట్టడంతో తలకు బలంగా గాయలై అక్కడికక్కడ మృతి చెందగా సమాచారం అందుకున్న పోలీసు వారు పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
విషయం తెలుసుకున్న చీరాల టిడిపి అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ వైద్యశాల వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీస్ వారిని వివరణ అడిగి తెలుసుకున్నారు.ఇంకెప్పుడు యాక్సిడెంట్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించి భార్గెడ్స్ పెట్టి డేంజర్ జోన్ గా బోర్డులు పెట్టాలని కోరారు. భారీ వాహనాలను దండుబాటు రహదారిగా పట్టణ వైపు మళ్ళించాలని పోలీసు వారికి సూచనలు చేశారు. పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు నష్టం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.










