చేనేత నేతన్నలకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రకటన.

0
1

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్ల బైలు టు పంచాయతీ బాబు కాలనీ సచివాలయంలో బుధవారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్‌పై అవగాహన సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, ఏప్రిల్ 1, 2026 నుంచి హ్యాండ్లూమ్ నేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఈ పథకం చేనేత కార్మికులకు ఆర్థికంగా మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.