అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన కార్యదర్శి అరవింద్, ఉపాధ్యక్షులు గురుమూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం చిత్తూరు జిల్లా జడ్జి శ్రీమతి అరుణ సారికను కలిసి పుంగనూరు కోర్టులో న్యాయమూర్తుల నియామకం చేయాలని వినతిపత్రం సమర్పించారు. జిల్లా జడ్జి సానుకూలంగా స్పందించి, త్వరలోనే న్యాయమూర్తుల నియామకం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు# కొత్తూరు మురళి.










