సోమల మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో సచివాలయం సమీపంలో నివాసమున్న 80 ఏళ్ల చెన్నమ్మ వద్ద గుర్తుతెలియని మహిళ మత్తుమందు చల్లి, మాటి కమ్మ, ముక్కు పుల్ల, నాలుగు నోముకొమ్ములు, నాలుగు గుండ్లు దోచుకెళ్లిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .









