వృద్ధులకు బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదని జన జాగృతి ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అతిధి గజపతికి వినతిపత్రం అందించారు.
విజయనగరంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి వృద్ధులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. జిల్లాలో ఈ సమస్యతో 3,733 మంది వృద్ధలు ఇబ్బంది పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
#RAJESH










